వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవమైన జూన్ 2న ఆదిలాబాద్‌లో ఇందిరమ్మ ఇళ్ల రెండో దశను ప్రారంభించనున్నట్లు మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి ప్రకటించారు. ఈ దశ విధివిధానాలపై మే 21న జరిగే మంత్రివర్గ సమావేశంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు.
నగర పేదలకు వారి నివాస ప్రాంతాలకు 5-8 కిలోమీటర్ల పరిధిలోనే ఇళ్లు నిర్మించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకోసం నియోజకవర్గాన్ని యూనిట్‌గా తీసుకుని భూములను గుర్తించాలని, ఈ ప్రక్రియలో ప్రజాప్రతినిధులను భాగస్వాములను చేయాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
Comments
Loading comments...

