వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి (బుధవారం) నుంచి ఈనెల 21 వరకు జరగనున్నాయి. ఉదయం ప్రథమ సంవత్సరం, మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు నిర్వహిస్తారు. ఐదు నిమిషాల ఆలస్యమైనా అనుమతించబోమని బోర్డు స్పష్టం చేసింది.
సందేహాల కోసం నాంపల్లి బోర్డు కార్యాలయంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. మే 21 నుంచే మూల్యాంకనం ప్రారంభించి, జూన్ రెండో వారంలో ఫలితాలు విడుదల చేయనున్నట్లు అధికారులు వెల్లడించారు.
Comments
Loading comments...

