వార్తలకు తిరిగి వెళ్లండి

సీజనల్ వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని, నిర్లక్ష్యం వహించవద్దని మంత్రి దామోదర రాజనర్సింహ అధికారులను ఆదేశించారు. వ్యాధులు ప్రబలకముందే ముందస్తు చర్యలు తీసుకోవాలని, అన్ని శాఖలతో సమన్వయం చేసుకుంటూ పారిశుద్ధ్యంపై దృష్టి సారించాలని సూచించారు.
ప్రతి జిల్లాలో ర్యాపిడ్ రెస్పాన్స్ టీమ్‌లు క్షేత్రస్థాయిలో నిరంతరం పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. సీజనల్ లక్షణాలు కనిపిస్తే వెంటనే ప్రభుత్వ ఆస్పత్రులను సంప్రదించాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

