Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సదరం సర్టిఫికెట్లకు నేటి నుంచి స్లాట్ బుకింగ్

Follow Udayam on Google
Anuroop Nov 02, 2026 10:10 AM అమరావతిGeneral
సదరం సర్టిఫికెట్లకు నేటి నుంచి స్లాట్ బుకింగ్ - Udayam
దివ్యాంగులు సదరం ధ్రువపత్రాలు పొందేందుకు ముందస్తు స్లాట్ బుకింగ్‌ను ప్రభుత్వం నేటి నుంచి అందుబాటులోకి తెచ్చింది. గ్రామ, వార్డు సచివాలయాలు, మన మిత్ర వాట్సాప్‌, ఏపీ సేవా పోర్టల్‌లో ఉదయం 10.30 గంటల నుంచి నమోదు చేసుకోవచ్చు. మొత్తం 21 రకాల వైకల్యాలకు ప్రత్యేక స్లాట్లు కేటాయించారు. బుకింగ్‌కు ఆధార్ కార్డు, దానికి అనుసంధానమైన ఫోన్ నంబర్ అవసరం. మన మిత్ర వాట్సాప్ నంబర్: 9552300009.

Comments

G
Loading comments...