వార్తలకు తిరిగి వెళ్లండి

మెహిదీపట్నంలోని సరోజినీ దేవి ఆసుపత్రిలో నీటి కొరత తీవ్రమైంది. జలమండలి సరఫరా సరిపోకపోవడంతో ఆపరేషన్ థియేటర్ల నిర్వహణ కష్టతరమై, శుక్లాల సర్జరీలు వాయిదా పడుతున్నాయి. దీనివల్ల దూర ప్రాంతాల రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
పెండింగ్ బిల్లుల కారణంగా ట్యాంకర్ల బుకింగ్‌కు సైతం ఆటంకాలు ఎదురవుతున్నాయి. అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించాలని ఆసుపత్రి వర్గాలు కోరుతున్నాయి.
Comments
Loading comments...

