వార్తలకు తిరిగి వెళ్లండి

సెమీకండక్టర్ రంగంలో వచ్చిన భారీ లాభాల నేపథ్యంలో సామ్‌సంగ్ తన చిప్ విభాగం ఉద్యోగులకు బంపరాఫర్ ప్రకటించింది. ఏఐ (AI) చిప్‌లకు ప్రపంచవ్యాప్తంగా డిమాండ్ పెరగడంతో కంపెనీ ఆదాయం భారీగా పెరిగింది. ఈ క్రమంలో ఒక్కో ఉద్యోగికి సుమారు రూ.3.3 కోట్ల వరకు బోనస్ లభించనుంది.
ఇటీవల లాభాల్లో వాటా కోసం ఉద్యోగులు సమ్మెకు పిలుపునివ్వడంతో యాజమాన్యం ఈ నిర్ణయం తీసుకుంది. దాదాపు 78 వేల మంది ఉద్యోగులకు ఆపరేటింగ్ లాభాల్లో 10.5 శాతం వాటాను బోనస్‌గా ఇవ్వనున్నారు. అయితే మొబైల్, గృహోపకరణాల విభాగాల ఉద్యోగులకు మాత్రం తక్కువ బోనస్ అందనుంది.
Comments
Loading comments...

