వార్తలకు తిరిగి వెళ్లండి

సమ్మక్క–సారక్క బ్యారేజ్ నిర్మాణానికి లైన్ క్లియర్ అయ్యింది. ఛత్తీస్‌గఢ్ సీఎం విష్ణుదేవ్ సాయితో రాష్ట్ర మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి భేటీ అయ్యారు. ప్రాజెక్టుకు అవసరమైన అభ్యంతర రహిత పత్రం (NOC) జారీ చేయాలని మంత్రి కోరగా, సీఎం సానుకూలంగా స్పందించారు.
ఈ ప్రాజెక్టు డీపీఆర్ తుది పరిశీలనకు ఎన్‌ఓసీ అత్యంత కీలకం. ఇది లభిస్తే తెలంగాణ రైతులకు సాగునీటి భద్రత కలుగుతుందని ప్రభుత్వం భావిస్తోంది. గత కొంతకాలంగా నిలిచిన ఈ ప్రక్రియలో మంత్రి భేటీతో కీలక ముందడుగు పడింది.
Comments
Loading comments...

