Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

సమంత ‘మా ఇంటి బంగారం’ తిరుమల సెంటిమెంట్

Follow Udayam on Google
Rohit Vohra Jun 18, 2026 4:05 PM జాతీయంవినోదం
సమంత ‘మా ఇంటి బంగారం’ తిరుమల సెంటిమెంట్ - Udayam
నటి సమంత ప్రధాన పాత్రలో నటించిన ‘మా ఇంటి బంగారం’ చిత్రబృందం గురువారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. సమంతతో పాటు ఆమె భర్త రాజ్ నిడిమోరు, నటి శ్రీముఖి, దర్శకురాలు నందిని రెడ్డి విఐపి విరామ సమయంలో స్వామివారి సేవలో పాల్గొన్నారు. దర్శనానంతరం రంగనాయకుల మండపంలో పండితులు వీరికి వేదాశీర్వచనం చేసి తీర్థప్రసాదాలు అందజేశారు. ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిన ఈ చిత్రం జూన్ 19న ప్రపంచవ్యాప్తంగా విడుదల కానున్న నేపథ్యంలో చిత్రబృందం స్వామివారి ఆశీస్సులు తీసుకుంది.

Comments

G
Loading comments...