వార్తలకు తిరిగి వెళ్లండి

శర్వానంద్ కథానాయకుడిగా సంపత్ నంది దర్శకత్వంలో వస్తున్న ‘భోగి’ చిత్రం ఆగస్టు 28న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఎమోషనల్ సీన్స్‌లో శర్వానంద్ అద్భుతంగా నటించారని, షూటింగ్ సెట్‌లో ఉన్న 200 మంది కళ్లు తుడుచుకుంటూ చప్పట్లు కొట్టారని దర్శకుడు తెలిపారు.
గత పదేళ్లలో శర్వానంద్ ఇంత గొప్పగా ఎప్పుడూ నటించలేదని సంపత్ నంది ప్రశంసించారు. అనుపమ పరమేశ్వరన్, డింపుల్ హయాతి కథానాయికలుగా నటిస్తున్న ఈ పీరియాడిక్ కథను పాన్ ఇండియా స్థాయిలో ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నట్లు ఆయన సోషల్ మీడియా వేదికగా వెల్లడించారు.
Comments
Loading comments...

