Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు దుర్మరణం

Follow Udayam on Google
Priya Desai Jun 01, 2026 9:50 AM విశాఖపట్నంGeneral
ఆగి ఉన్న టిప్పర్‌ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు.. ముగ్గురు దుర్మరణం - Udayam
గాజువాక శ్రీనగర్‌ వద్ద ఆదివారం తెల్లవారుజామున ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రాజమహేంద్రవరం నుంచి పార్వతీపురం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ఆగి ఉన్న టిప్పర్‌ను బలంగా ఢీకొట్టింది. ఈ ఘటనలో ఇద్దరు మహిళా ప్రయాణికులు, సహాయ డ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందగా, మరో 9 మంది తీవ్రంగా గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తే ఈ దుర్ఘటనకు కారణమని పోలీసులు తెలిపారు. గాయపడిన వారికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.

Comments

G
Loading comments...