Back to feed
రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం: దర్యాప్తు బాధ్యతల్లో ఎస్పీ
Arun Jun 18, 2026 5:36 AM విజయవాడ 2 viewsabout 1 hour ago

విజయవాడ రౌడీషీటర్ సాయికృష్ణ అదృశ్యం కేసు దర్యాప్తును రాజమండ్రి ఎస్పీ నరసింహ కిషోర్‌కు అప్పగించారు. లాకప్‌డెత్ ఆరోపణలు, కుటుంబ సభ్యుల అనుమానాల నేపథ్యంలో కేసులో సమగ్ర విచారణ చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఈ కీలక నిర్ణయం తీసుకున్నారు.
గురువారం కృష్ణలంక పోలీస్ స్టేషన్‌లో ఎస్పీ విచారణ చేపట్టనున్నారు. ఇప్పటికే సాయికృష్ణ కుటుంబ సభ్యులు సీబీఐ విచారణ కోరుతుండటంతో, ఈ కేసు ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశంగా మారింది.
Comments
Loading comments...



