Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య, భార్య పరిస్థితి విషమం

Follow Udayam on Google
Suresh Gupta Jun 18, 2026 12:31 PM నంద్యాలGeneral
అప్పుల బాధతో వ్యాపారి ఆత్మహత్య, భార్య పరిస్థితి విషమం - Udayam
నంద్యాల జిల్లా డోన్ పట్టణానికి చెందిన బుధవరపు శ్రీనివాసులు, పద్మావతి దంపతులు అప్పుల బాధ తాళలేక పురుగుల మందు సేవించి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. తమకు దాదాపు కోటి రూపాయల అప్పు ఉందని సూసైడ్ నోట్ రాసి ఇంట్లోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. కుటుంబ సభ్యులు వీరిని కర్నూలులోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా, చికిత్స పొందుతూ భర్త శ్రీనివాసులు మృతి చెందారు. ప్రస్తుతం భార్య పద్మావతి ఆసుపత్రిలో ప్రాణాపాయ స్థితిలో చికిత్స పొందుతున్నారు. శ్రీనివాసులు నెయ్యి, పసుపు ఏజెన్సీ వ్యాపారం నిర్వహించేవారని సమాచారం.

Comments

G
Loading comments...