Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రేమ జంటలనే టార్గెట్ చేస్తూ దోపిడీ

Follow Udayam on Google
Sonia Jun 11, 2026 12:05 PM వరంగల్General
ప్రేమ జంటలనే టార్గెట్ చేస్తూ దోపిడీ - Udayam
ఉర్సుగుట్ట ప్రాంతంలో ఏకాంతంగా ఉన్న ప్రేమ జంటలను బెదిరించి దోపిడీకి పాల్పడుతున్న ముగ్గురు పాత నేరస్థులను మిల్స్‌కాలనీ పోలీసులు అరెస్ట్ చేశారు. నిర్మానుష్య ప్రదేశంలో ఉన్న ఒక జంటను ఫోటోలు, వీడియోలు తీసి, తల్లిదండ్రులకు చెప్తామంటూ నిందితులు డబ్బుల కోసం బెదిరించారు. బాధితుల వద్ద డబ్బులు లేకపోవడంతో వారిపై దాడి చేసి బంగారు, వెండి ఉంగరాలను లాక్కొని, యువతి పట్ల అసభ్యంగా ప్రవర్తించారు. దోచుకున్న వస్తువులను వరంగల్‌లో అమ్మేందుకు ప్రయత్నిస్తుండగా పోలీసులు నిందితులను పట్టుకుని, వస్తువులను స్వాధీనం చేసుకుని రిమాండ్‌కు తరలించారు.

Comments

G
Loading comments...