వార్తలకు తిరిగి వెళ్లండి

వనపర్తి జిల్లా కొత్తకోట వద్ద శుక్రవారం జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో కర్ణాటకకు చెందిన ముగ్గురు వ్యక్తులు దుర్మరణం చెందారు. వీరు ప్రయాణిస్తున్న బొలేరో వాహనాన్ని వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ బలంగా ఢీకొనడంతో ఈ ఘటన చోటుచేసుకుంది.
ప్రమాద తీవ్రతకు ముగ్గురు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని కేసు నమోదు చేశారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించి, లారీ డ్రైవర్ కోసం గాలింపు చేపట్టారు.
Comments
Loading comments...

