వార్తలకు తిరిగి వెళ్లండి

పర్యావరణ పరిరక్షణ, ఇంధన పొదుపు లక్ష్యంగా జీహెచ్‌ఎంసీ అధికారులు, మేయర్ కోసం 45 సరికొత్త ఎలక్ట్రిక్ కార్లను కొనుగోలు చేయనున్నారు. జయేష్ రంజన్ అధ్యక్షతన జరిగిన స్టాండింగ్ కమిటీ సమావేశంలో ఈ వాహనాల కొనుగోలు ప్రతిపాదనకు సభ్యులు ఒకే చెప్పారు.
ఈ సమావేశంలో విద్యుత్ వాహనాలతో పాటు రోడ్ల విస్తరణ, కొత్త కార్యాలయ భవన నిర్మాణం సహా మొత్తం 30 ప్రజా ఉపయోగకర అంశాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. వీధి దీపాల పర్యవేక్షణ మెరుగుపరచడానికి 10 మంది ఎలక్ట్రికల్ ఇంజనీర్లను నియమించనున్నారు.
Comments
Loading comments...

