వార్తలకు తిరిగి వెళ్లండి

ఆంధ్రప్రదేశ్‌లోని సామర్లకోట, తణుకు నుంచి చైనాకు ఒకే రోజు 2,700 టన్నుల బియ్యాన్ని ఎగుమతి చేసి చెన్నై పోర్టు రికార్డు సృష్టించింది. 42 వ్యాగన్లలో ఈ బియ్యాన్ని తండియార్‌పేట డిపోకు తీసుకొచ్చి అక్కడి నుంచి నౌక ద్వారా చైనాకు తరలించారు. విశాఖలో కంటెయినర్ల కొరత, అధిక ఖర్చుల వల్లే ఏజెంట్లు చెన్నైని ఎంచుకోగా, రైలు మార్గంలో రవాణా చేయడంతో 40% ఖర్చు ఆదా అయిందని అధికారులు తెలిపారు.
Comments
Loading comments...

