Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు

Follow Udayam on Google
జయ ప్రకాష్ Jul 15, 2026 2:19 PM జాతీయంGeneral
చురుగ్గా మారిన నైరుతి రుతుపవనాలు - Udayam
ఎల్‌నినో ప్రభావంతో వర్షాల్లేక ఉక్కపోతతో అల్లాడుతున్న ప్రజలకు భారత వాతావరణ శాఖ (IMD) ఊరట కలిగించే వార్త చెప్పింది. ఇన్నాళ్లు మందగించిన నైరుతి రుతుపవనాలు దేశవ్యాప్తంగా మళ్లీ పుంజుకుని చురుగ్గా కదలడానికి అనుకూల పరిస్థితులు ఏర్పడ్డాయని వెల్లడించింది. బంగాళాఖాతంలో బలమైన అల్పపీడన ద్రోణి ఏర్పడుతుండటంతో రుతుపవనాల విస్తరణకు మార్గం సుగమమైందని శాస్త్రవేత్తలు తెలిపారు. దీంతో త్వరలోనే దేశంలోని పలు ప్రాంతాల్లో విస్తారంగా వర్షాలు కురిసే అవకాశం ఉందని ఐఎండీ స్పష్టం చేసింది.

Comments

G
Loading comments...