Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

బస్సుల పునరుద్ధరణకు సర్పంచుల వినతి

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:19 PM జనగామ General
బస్సుల పునరుద్ధరణకు సర్పంచుల వినతి - Udayam
జనగామ డిపో నుంచి జేబీఎస్‌కు గతంలో నడిచిన బస్సును పునరుద్ధరించాలని పలువురు సర్పంచులు డిపో మేనేజర్‌కు వినతిపత్రం అందజేశారు. బచ్చన్నపేట నుంచి కొన్నే, కేశాపూర్‌కు సాయంత్రం 6 గంటలకు బస్సు నడపాలని కోరారు. కొన్నే సర్పంచ్‌ శివకుమార్‌గౌడ్, లింగంపల్లి సర్పంచ్‌ రాధ, సాలాపూర్ సర్పంచ్‌ సందీప్, మన్సాన్‌పల్లి సర్పంచ్‌ శ్రీధర్‌గౌడ్ వినతిపత్రం అందజేశారు. దీనిపై మేనేజర్‌ సానుకూలంగా స్పందించారని తెలిపారు.

Comments

G
Loading comments...