వార్తలకు తిరిగి వెళ్లండి

జస్టిస్ యశ్వంత్ వర్మ తొలగింపు అంశంపై జడ్జీల విచారణ కమిటీ రూపొందించిన నివేదికను సోమవారం లోక్‌సభ స్పీకర్ ఓం బిర్లాకు అందజేశారు. జడ్జీల ఎంక్వైరీ చట్టం-1968 ప్రకారం దర్యాప్తు చేపట్టిన ఈ నివేదికను త్వరలోనే పార్లమెంట్ ఉభయసభల్లో ప్రవేశపెట్టనున్నారు.
గత ఏడాది మార్చిలో వర్మ నివాసంలో సగం కాలిన నోట్ల కట్టలు దొరకడంతో ఈ విచారణ కమిటీ ఏర్పాటైంది. కాగా, అలహాబాద్ హైకోర్టు న్యాయమూర్తిగా ఉన్న ఆయన ఇప్పటికే తన రాజీనామాను రాష్ట్రపతికి సమర్పించారు.
Comments
Loading comments...

