వార్తలకు తిరిగి వెళ్లండి

మెమొరీ చిప్‌ల కొరత, విడిభాగాల ఖర్చులు పెరగడంతో రెడ్‌మీ కంపెనీ తన ఫోన్ల ధరలను మరోసారి పెంచింది. రెడ్‌మీ 15, రెడ్‌మీ నోట్ 15 మోడళ్లపై రూ.2 వేల వరకు ధరలను పెంచుతున్నట్లు ప్రకటించింది. ఈ సవరించిన ధరలు నేటి నుంచే అమల్లోకి రానున్నాయి.
దీంతో రెడ్‌మీ నోట్ 15 (8GB+128GB) ధర రూ.26,999కు చేరగా, రెడ్‌మీ 15 ప్రారంభ వేరియంట్ ధర రూ.20,499కు పెరిగింది. జనవరిలో విడుదలైనప్పటి నుంచి ఇప్పటివరకు ఈ ఫోన్ల ధరలు దాదాపు రూ.4 వేల వరకు పెరగడం గమనార్హం.
Comments
Loading comments...

