Back to feed
రాయదుర్గంలో భూముల రికార్డు ధర
Rajdeep Sardesai May 28, 2026 12:40 PM హైదరాబాద్ 4 views37 minutes ago

హైదరాబాద్ రాయదుర్గం పాన్‌మక్తాలో TGIIC నిర్వహించిన వేలంలో భూమి ధర రికార్డు సృష్టించింది. గురువారం జరిగిన ఈ వేలంలో ఒక ఎకరం భూమి ఏకంగా రూ. 237 కోట్ల భారీ ధరకు అమ్ముడైంది. నగర ఐటీ కారిడార్‌లో ఉండటంతో, ఈ ధర గత రికార్డులను అధిగమించి అందరినీ ఆశ్చర్యపరిచింది.
ప్రస్తుతం మరికొన్ని ప్లాట్ల వేలం కొనసాగుతోంది. ఐటీ హబ్‌లకు దగ్గరగా ఉండటం, మల్టీ-యూజ్ జోనింగ్ వెసులుబాటుతో రియల్ ఎస్టేట్ సంస్థలు భారీగా పోటీపడుతున్నాయి. ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి రికార్డు స్థాయి ఆదాయం రానుంది.
Comments
Loading comments...



