Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏడీఈ

Follow Udayam on Google
Ravi Shukla May 22, 2026 3:28 PM మెదక్General
రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిన ఏడీఈ - Udayam
మెదక్‌ జిల్లా నర్సాపూర్‌ డివిజన్‌ విద్యుత్‌ శాఖ ఏడీఈ ముద్దం రమణా రెడ్డి రూ.25 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుబడ్డారు. రూ.3.13 లక్షల కాంట్రాక్ట్‌ బిల్లుల మంజూరి కోసం ఆయన ఈ లంచం డిమాండ్‌ చేశారు. బాధిత కాంట్రాక్టర్‌ ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు దాడి చేసి రమణా రెడ్డిని శుక్రవారం మధ్యాహ్నం అదుపులోకి తీసుకున్నారు. ఆయనపై కేసు నమోదు చేసి, హైదరాబాద్‌ ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టినట్లు అధికారులు వివరించారు.

Comments

G
Loading comments...