వార్తలకు తిరిగి వెళ్లండి

రంగారెడ్డి జిల్లా రావిర్యాలలోని హౌసింగ్ బోర్డు స్థలాలకు గురువారం నిర్వహించిన ఈ-వేలంలో రికార్డు స్థాయి ధరలు పలికాయి. నాలుగు ప్లాట్ల వేలం ద్వారా చదరపు గజం గరిష్టంగా రూ.83,500 కు అమ్ముడుపోగా, ప్రభుత్వానికి సుమారు రూ.140 కోట్ల ఆదాయం సమకూరినట్లు అధికారులు తెలిపారు.
ఈ వేలంలో 17 సంస్థలు పోటీ పడ్డాయి. కాగా, కేపీహెచ్‌బీ కాలనీ, కుత్బుల్లాపూర్ చింతల్ ప్రాంతాల్లోని మరికొన్ని స్థలాలకు శుక్రవారం ఈ-వేలం నిర్వహించనున్నారు.
Comments
Loading comments...

