Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు

Follow Udayam on Google
Vikram Chandra May 27, 2026 11:59 AM జాతీయంబిజినెస్
రవీంద్రన్‌కు ఆరు నెలల జైలు - Udayam
ఎడ్‌టెక్ రంగ ప్రముఖ సంస్థ బైజూస్ వ్యవస్థాపకుడు రవీంద్రన్‌కు కోర్టు ధిక్కరణ కేసులో సింగపూర్ న్యాయస్థానం ఆరు నెలల జైలు శిక్ష విధించింది. కోర్టు ఇచ్చిన పలు ఉత్తర్వులను ఉల్లంఘించినందుకు గానూ ఆయనకు ఈ శిక్షతో పాటు 70,500 డాలర్ల భారీ జరిమానా కూడా పడింది. బైజూస్ ఆల్ఫా ద్వారా సేకరించిన రుణ నిబంధనలను ఉల్లంఘించి, 533 మిలియన్ డాలర్ల నిధులను అమెరికా నుండి చట్టవిరుద్ధంగా తరలించారనే ఆరోపణలపై రవీంద్రన్‌ చట్టపరమైన చర్యలు ఎదుర్కొంటున్నారు. ఈ క్రమంలోనే తాజా కోర్టు తీర్పు వెలువడింది.

Comments

G
Loading comments...