Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ పూజలు

Follow Udayam on Google
Priya Ranjan May 27, 2026 2:04 PM జాతీయంవినోదం
చాముండేశ్వరి ఆలయంలో రణ్‌వీర్ పూజలు - Udayam
'కాంతార' సినిమా సన్నివేశాన్ని అనుకరించి వివాదంలో చిక్కుకున్న బాలీవుడ్ హీరో రణ్‌వీర్ సింగ్ మంగళవారం మైసూరు చాముండేశ్వరి దేవి ఆలయాన్ని సందర్శించారు. గతంలో ఈ వివాదంపై ఆయన క్షమాపణలు చెప్పగా, అందులో నిజాయతీ లేదంటూ కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. ఈ పిటిషన్‌ను విచారించిన న్యాయస్థానం, ప్రాయశ్చితంగా నాలుగు వారాల్లోగా చాముండేశ్వరి దేవిని దర్శించుకోవాలని రణ్‌వీర్‌ను ఆదేశించింది. కోర్టు విధించిన గడువు ముగియనుండటంతో ఆయన ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు.

Comments

G
Loading comments...