వార్తలకు తిరిగి వెళ్లండి

కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు సోమవారం కుటుంబ సభ్యులతో కలిసి తిరుమల శ్రీవారిని దర్శించుకున్నారు. భక్తుల తాకిడి పెరుగుతున్నా ఎలాంటి లోటుపాట్లు లేకుండా తితిదే చేస్తున్న ఏర్పాట్లను ఆయన అభినందించారు.
దర్శనానంతరం పండితులు ఆయనకు తీర్థప్రసాదాలు అందజేశారు. ఎండలు ఎక్కువగా ఉన్నందున భక్తులు తగిన ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవాలని కేంద్ర మంత్రి విజ్ఞప్తి చేశారు.
Comments
Loading comments...

