Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రైతుల సమస్యలు పరిష్కరించాలి: వడ్డే శోభనాద్రిశ్వరరావు

Follow Udayam on Google
Reporter.Bharath Sep 20, 2026 5:06 PM గుంటూరుక్రీడలు
రైతుల సమస్యలు పరిష్కరించాలి: వడ్డే శోభనాద్రిశ్వరరావు - Udayam
మాజీ మంత్రి వడ్డే శోభనాద్రిశ్వరరావు ఆదివారం ఉండవల్లిలో మీడియాతో మాట్లాడారు. రాజధాని కోసం భూములు ఇచ్చిన రైతులతో చేసుకున్న ఒప్పందాలను ప్రభుత్వం గౌరవించాలని కోరారు. ప్రతి గ్రామంలో ఆసుపత్రి, పాఠశాల ఏర్పాటు చేయడంతో పాటు, రైతులకు బ్యాంకు రుణాలు అందేలా ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని అన్నారు. అభివృద్ధి పేరుతో ఆచరణ సాధ్యం కాని అంశాలపై దృష్టి మళ్లించకుండా, రైతులకు సాగునీరు, ఇతర సమస్యలను పరిష్కరించాలన్నారు.

Comments

G
Loading comments...