వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రంలో అకాల వర్షాలు, ఈదురుగాలుల నేపథ్యంలో సీఎం రేవంత్‌రెడ్డి అధికారులను అప్రమత్తం చేశారు. ముఖ్యంగా ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో రైతులకు ఎలాంటి నష్టం కలగకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలని, కొనుగోళ్ల ప్రక్రియను మరింత వేగవంతం చేయాలని ఆయన ఆదేశించారు.
కల్లాల్లోని ధాన్యం తడవకుండా ఉండేందుకు అవసరమైన టార్పాలిన్లను అందుబాటులో ఉంచాలని సూచించారు. వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్ జారీ చేసినందున, అత్యవసర పరిస్థితుల్లో అధికారులు తక్షణమే స్పందించాలని మరియు ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండాలని సీఎం పేర్కొన్నారు.
Comments
Loading comments...

