వార్తలకు తిరిగి వెళ్లండి

తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ జరుగుతుందనే ప్రచారం నేపథ్యంలో అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్‌కుమార్ దిల్లీలో రాహుల్ గాంధీతో భేటీ అయ్యారు. అధిష్ఠానం పిలుపు మేరకు శుక్రవారం హుటాహుటిన దిల్లీ వెళ్లిన ఆయన, రాహుల్‌తో వివిధ రాజకీయ అంశాలపై చర్చించడం ప్రాధాన్యత సంతరించుకుంది.
ఈ సమావేశంలో తనకు మంత్రివర్గంలో చోటు కల్పించాలని ప్రసాద్‌కుమార్ కోరినట్లు సమాచారం. తాను ఏ పరిస్థితుల్లో క్యాబినెట్ పదవి ఆశిస్తున్నాననే విషయాన్ని ఆయన రాహుల్ గాంధీకి వివరించినట్లు తెలుస్తోంది.
Comments
Loading comments...

