Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: హెచ్ఎం సురేష్ కుమార్

Follow Udayam on Google
Rohit Jun 11, 2026 2:02 PM మహబూబ్‌నగర్General
ప్రభుత్వ బడుల్లోనే నాణ్యమైన విద్య: హెచ్ఎం సురేష్ కుమార్ - Udayam
తల్లిదండ్రులు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించాలని జడ్పీహెచ్ఎస్ ప్రధానోపాధ్యాయులు సురేష్ కుమార్ కోరారు. మండలంలోని ఉడిత్యాలలో 'బడిబాట' కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులు ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఉచిత విద్యతో పాటు, అనుభవజ్ఞులైన ఉపాధ్యాయుల బోధన, నాణ్యమైన పౌష్టికాహారం, క్రీడల్లో ప్రత్యేక ప్రోత్సాహం లభిస్తాయని వారు వివరించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ఉపాధ్యాయులు, గ్రామస్థులు పాల్గొన్నారు.

Comments

G
Loading comments...