Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

రూ.811 కోట్లతో 160 ఆయుధాల కొనుగోలు

Follow Udayam on Google
Kiran Sep 23, 2026 6:41 PM జాతీయంGeneral
రూ.811 కోట్లతో 160 ఆయుధాల కొనుగోలు - Udayam
భారత వైమానిక దళం కోసం 160 శాటిలైట్‌ స్మార్ట్‌ యాంటీ-ఎయిర్‌ఫీల్డ్‌ వెపన్స్‌ (SAT-SAAW) కొనుగోలుకు రక్షణ శాఖ భారత్‌ డైనమిక్స్‌ లిమిటెడ్‌తో రూ.810.79 కోట్ల ఒప్పందం కుదుర్చుకుంది. డెలివరీ 2027-28, 2028-29లో జరగనుంది. డీఆర్‌డీఓ అభివృద్ధి చేసిన ఈ ఆయుధాల్లో 60 శాతం స్వదేశీ కంటెంట్‌ ఉంటుందని రక్షణ శాఖ తెలిపింది. జాగ్వార్‌, హాక్‌, సు-30 ఎంకేఐ వంటి విమానాల నుంచి వీటిని ప్రయోగించవచ్చని పేర్కొంది.

Comments

G
Loading comments...