వార్తలకు తిరిగి వెళ్లండి

2027 పంజాబ్ అసెంబ్లీ ఎన్నికల కోసం కాంగ్రెస్ అధిష్టానం బుధవారం ప్రకటించిన కొత్త కమిటీ పార్టీలో తీవ్ర అంతర్గత సంక్షోభానికి దారితీసింది. పీసీసీ అధ్యక్షుడిగా లూథియానా ఎంపీ అమరీందర్ సింగ్ రాజా వడింగ్‌ను కొనసాగించాలని తీసుకున్న నిర్ణయమే ఈ లుకలుకలకు ప్రధాన కారణమైంది.
అధిష్టానం ఏకపక్ష నిర్ణయంపై పార్టీలోని పలువురు సీనియర్ నేతలు తీవ్ర ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎన్నికల కమిటీ అసమ్మతి శ్రేణుల్లో తీవ్ర అసంతృప్తిని రగిల్చడంతో పంజాబ్ కాంగ్రెస్‌లో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది.
Comments
Loading comments...

