వార్తలకు తిరిగి వెళ్లండి

పుంగనూరులోని కొత్తఇండ్లు పెట్రోల్ బంక్ సమీపంలో మంగళవారం రాత్రి గాలికి ఎగిరిన ప్లైవుడ్ షీట్ 33 KV విద్యుత్ తీగలపై పడింది. దీంతో మంటలు చెలరేగి SNపేట, చింతలవీధి, కుమ్మరివీధి ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది.
సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ సిబ్బంది సుమారు 3 గంటల పాటు శ్రమించి మరమ్మతులు చేపట్టి విద్యుత్ సరఫరాను పునరుద్ధరించారు.
Comments
Loading comments...

