వార్తలకు తిరిగి వెళ్లండి

పీఎం వాణి ద్వారా దేశవ్యాప్తంగా ప్రజలందరికీ పబ్లిక్ వైఫై అందుబాటులోకి తేవడమే లక్ష్యంగా పనిచేస్తున్నట్లు కేంద్ర కమ్యూనికేషన్ల శాఖ సహాయమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పేర్కొన్నారు. విద్యార్థులు, ప్రయాణికులు, చిరు వ్యాపారుల కోసం క్యూఆర్ కోడ్ ఆధారిత సులభమైన లాగిన్ విధానాన్ని తీసుకువస్తున్నట్లు ఆయన వెల్లడించారు.
మొబైల్ ద్వారా స్కాన్ చేసి ల్యాప్‌టాప్‌కు కనెక్ట్ చేసుకునేలా, 15, 30, 60 నిమిషాల ప్రత్యేక ప్లాన్లను ప్రవేశపెడుతున్నారు. రైల్వేస్టేషన్లు, బస్టాండ్లు, మాల్స్ వంటి బహిరంగ ప్రదేశాలలో ఈ హాట్‌స్పాట్‌లను సులభంగా గుర్తించేందుకు ప్రామాణిక గుర్తులను కూడా ఏర్పాటు చేయనున్నారు.
Comments
Loading comments...

