Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

‘రైతు డిస్కమ్’పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ

Follow Udayam on Google
Manisha Gupta May 29, 2026 3:00 PM హైదరాబాద్General
‘రైతు డిస్కమ్’పై నేడు ప్రజాభిప్రాయ సేకరణ - Udayam
తెలంగాణలో ‘రైతు డిస్కమ్’కు లైసెన్స్ జారీ చేసే అంశంపై విద్యుత్ నియంత్రణ మండలి (ఈఆర్సీ) నేడు హైదరాబాద్‌లో ప్రజాభిప్రాయ సేకరణ చేపట్టనుంది. లైసెన్స్ ఇవ్వకుండా అడ్డుకుంటామని బీఆర్ఎస్ ప్రకటించగా, ఈ మీటింగ్‌లో పాల్గొంటామని ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ వెల్లడించారు. మరోవైపు కాంగ్రెస్ తరఫున ఎంపీ చామల కిరణ్ కుమార్ రెడ్డి, ఎమ్మెల్సీ కోదండరాం, రైతుల పక్షాన కోదండరెడ్డి హాజరై వాదనలు వినిపించనున్నారు. రాజకీయ నాయకులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు.

Comments

G
Loading comments...