వార్తలకు తిరిగి వెళ్లండి
Breaking

ప్రముఖ సినీ నిర్మాత చలసాని వెంకటేశ్వరరావు వృద్ధాప్య సమస్యలతో బుధవారం రాత్రి కన్నుమూశారు. టికెట్ బుకింగ్ క్లర్క్‌గా కెరీర్ ప్రారంభించిన ఆయన డిస్ట్రిబ్యూటర్, ఎగ్జిబిటర్‌గా ఎదిగి, సినీ నిర్మాతగా గుర్తింపు పొందారు. చిత్ర పరిశ్రమలో ఆయనను జగపతి వెంకటేశ్వరరావు, జేవీఆర్ అని పిలిచేవారు.
జగపతి మూవీ క్రియేషన్స్ పతాకంపై ‘నేటి దౌర్జన్యం’, ‘కరుణించిన కనకదుర్గ’ వంటి చిత్రాలను నిర్మించారు.
Comments
Loading comments...

