వార్తలకు తిరిగి వెళ్లండి
కురుపాం నియోజకవర్గంలో గల ఐదు మండలాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఎమ్మెల్యే జగదీశ్వరి సూచించారు. మన్యం జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రజలంతా సురక్షితంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దన్నారు.
వర్షాలు పడేటప్పుడు చెట్ల కింద, శిథిలావస్థ భవనాల వద్ద ఉండొద్దన్నారు. ఏజెన్సీ ప్రాంతాల్లో కొండపోడుకు వెళ్లొద్దని, వాగులు దాటే ప్రయత్నాలు చేయొద్దన్నారు. రెవెన్యూ అధికారుల సూచనలు పాటించాలని కోరారు.
Comments
Loading comments...

