వార్తలకు తిరిగి వెళ్లండి

అనంతపురం జిల్లా గుత్తి సమీపంలో హైదరాబాద్ నుంచి ధర్మవరం వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. జాతీయ రహదారిపై జరిగిన ఈ ప్రమాదంలో 19 మంది ప్రయాణికులు గాయపడ్డారు. డ్రైవర్ నిద్రమత్తు వల్లే ఈ దుర్ఘటన చోటుచేసుకున్నట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్ధారించారు.
సమాచారం అందుకున్న పోలీసులు, హైవే సిబ్బంది వెంటనే స్పందించి క్షతగాత్రులను గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారు సురక్షితంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Loading comments...

