వార్తలకు తిరిగి వెళ్లండి

ఇంధన ధరల పెంపు, పసిడిపై దిగుమతి సుంకాల వల్ల జూన్‌లో రిటైల్ ద్రవ్యోల్బణం 5 శాతానికి చేరవచ్చని ఆర్థికవేత్తలు అంచనా వేస్తున్నారు. పెట్రోల్, డీజిల్ లీటరుకు రూ.7.50 పెరగడంతో రవాణా వ్యయాలు ఎక్కువై నిత్యావసరాల ధరలపై ప్రభావం పడనుంది.
ఈ ధరల పెరుగుదల నేపథ్యంలో, వడ్డీ రేట్ల మార్పుపై ఆర్‌బీఐ ఆచితూచి అడుగులు వేయనుంది. జూన్ మొదటివారంలో జరిగే సమీక్షలో కీలక రేట్లను యథాతథంగా ఉంచవచ్చని విశ్లేషకులు భావిస్తున్నారు.
Comments
Loading comments...

