వార్తలకు తిరిగి వెళ్లండి

పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యులపై పిడుగుపాటులా మారిందని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మండిపడ్డారు. ఇరాన్-ఇజ్రాయెల్ యుద్ధాన్ని సాకుగా చూపి కేంద్ర ప్రభుత్వం ధరలు పెంచడం ప్రజల నడ్డి విరచడమేనని ఆయన 'ఎక్స్' వేదికగా విమర్శించారు.
ఎన్నికల ఫలితాలు వచ్చిన పది రోజుల్లోనే ధరలు పెంచడం విశ్వాస ఘాతుకమని రేవంత్ ధ్వజమెత్తారు. మోదీ సర్కార్ అనాలోచిత విధానాల వల్లే దేశ ఆర్థిక వ్యవస్థ కుదేలైందని, పెంచిన ఇంధన ధరలను తక్షణమే ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.
Comments
Loading comments...

