వార్తలకు తిరిగి వెళ్లండి

గోదావరిఖని శివారులోని పుష్కర ఘాట్, వంతెన సమీపంలో గోదావరి నది నీరు కాలుష్యంగా మారింది. ప్రవాహం తగ్గడంతో నీరు చిన్న పాయలుగా విడిపోవడంతో చెత్తాచెదారం, మురికినీరు, వ్యర్థాలు పేరుకుపోయాయి.
నది పరిసరాలు దుర్గంధభరితంగా మారాయని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పక్కనే స్మశానవాటిక ఉండటంతో పరిస్థితి మరింత అధ్వానంగా మారిందని తెలిపారు. నది పరివాహక ప్రాంతాన్ని శుభ్రంగా ఉంచాలని అధికారులను కోరారు.
Comments
Loading comments...

