Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన షెడ్యూల్ విశేషాలు

Follow Udayam on Google
శ్రుతి రెడ్డి Jul 03, 2026 5:29 PM జాతీయంGeneral
ప్రధాని మోదీ మూడు దేశాల పర్యటన షెడ్యూల్ విశేషాలు - Udayam
ప్రధాని నరేంద్ర మోదీ జూలై 9 నుంచి మూడు దేశాల్లో పర్యటించనున్నట్లు విదేశాంగ శాఖ కార్యదర్శి రూపేంద్ర టాండన్ వెల్లడించారు. జూలై 9న ఇండోనేషియా, 10న ఆస్ట్రేలియా, 11న న్యూజిలాండ్‌లలో ప్రధాని అధికారిక పర్యటనలు కొనసాగుతాయని వీక్లీ బ్రీఫింగ్‌లో మీడియాకు స్పష్టం చేశారు. ఇండోనేషియా పర్యటనలో భాగంగా జకార్తాతో పాటు చారిత్రక నగరం యోగ్యకర్తను ప్రధాని సందర్శిస్తారు. యునెస్కో ప్రపంచ వారసత్వ సంపద 'ప్రాంబనన్ ఆలయ సముదాయం' పరిరక్షణ కోసం ఇండోనేషియాతో కలిసి భారత్ పని చేయనుందని వివరించారు.

Comments

G
Loading comments...