Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావుకు 14 రోజుల రిమాండ్

Follow Udayam on Google
Vikram Chandra Jun 04, 2026 11:44 AM హైదరాబాద్General
ఫోన్ ట్యాపింగ్ నిందితుడు భుజంగరావుకు 14 రోజుల రిమాండ్ - Udayam
ఫోన్ ట్యాపింగ్ కేసు నిందితుడు, సస్పెండెడ్ అదనపు ఎస్పీ భుజంగరావుకు ఏసీబీ కోర్టు 14 రోజుల రిమాండ్ విధించడంతో చంచల్‌గూడ జైలుకు తరలించారు. ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భాగంగా హైదరాబాద్, నల్గొండ సహా 15 చోట్ల ఏసీబీ అధికారులు నిర్వహించిన సోదాల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ తనిఖీల్లో సుమారు రూ.5.92 కోట్ల విలువైన అక్రమ చర, స్థిరాస్తులను అధికారులు గుర్తించారు. రెండేళ్ల క్రితం ఫోన్ ట్యాపింగ్ కేసులో బెయిల్‌పై వచ్చిన భుజంగరావు, ఆస్తులకు సరైన లెక్కలు చూపకపోవడంతో ఏసీబీ తాజాగా అరెస్ట్ చేసింది.

Comments

G
Loading comments...