వార్తలకు తిరిగి వెళ్లండి

పెడనలోని గ్యాస్ కంపెనీలో సర్వర్ సమస్యతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సిలిండర్ కోసం వచ్చిన వారికి OTP రావడానికి రెండు గంటలు పడుతుందని సిబ్బంది చెప్పడంతో అసహనం వ్యక్తం చేశారు.
గ్రామీణ ప్రాంతాల నుంచి సుమారు 15 కి.మీ. ప్రయాణించి వచ్చిన వారికి కూడా ఇదే పరిస్థితి ఎదురైంది. పౌరసరఫరాల శాఖ అధికారులు జోక్యం చేసుకుని గ్యాస్ పంపిణీ జరిగేలా చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరారు.
Comments
Loading comments...

