వార్తలకు తిరిగి వెళ్లండి

జోగులాంబ గద్వాల జిల్లా అయిజలో పానీపూరి తిన్న 15 మంది అస్వస్థతకు గురయ్యారు. మంగళవారం రాత్రి పానీపూరి తిన్న కొద్దిసేపటికే బాధితులకు వాంతులు, విరేచనాలు మొదలవ్వడంతో హుటాహుటిన ఆస్పత్రికి తరలించారు. కలుషిత నీరు, నాణ్యత లేని పదార్థాలే దీనికి కారణమని స్థానికులు అనుమానిస్తున్నారు.
ప్రస్తుతం ఐదుగురు బాధితులు చికిత్స పొందుతున్నారు. పోలీసులు ఆ పానీపూరి బండిని స్వాధీనం చేసుకుని దర్యాప్తు చేపట్టారు. పలువురు రాజకీయ నాయకులు ఆస్పత్రిలో బాధితులను పరామర్శించారు. బయట ఆహారం విషయంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Comments
Loading comments...

