వార్తలకు తిరిగి వెళ్లండి

టీజీ20 లీగ్‌లో పాలమూరు స్ట్రైకర్స్ బోణీ కొట్టింది. గురువారం రాత్రి జరిగిన పోరులో మెదక్ ఫాల్కన్స్‌పై ఐదు వికెట్ల తేడాతో అద్భుత విజయం సాధించింది. మెదక్ నిర్దేశించిన 165 పరుగుల లక్ష్యాన్ని పాలమూరు జట్టు మరో 13 బంతులు మిగిలి ఉండగానే అలవోకగా ఛేదించింది.
పాలమూరు బ్యాటర్లలో రోహిత్ రాయుడు (54 నాటౌట్) బాధ్యతాయుత అర్ధశతకంతో రాణించి 'ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్'గా నిలిచాడు. విఘ్నేష్ రెడ్డి, ప్రతీక్ వేగంగా ఆడటంతో మూడు మ్యాచ్‌ల్లో పాలమూరుకు ఇదే మొదటి విజయం కావడం విశేషం.
Comments
Loading comments...

