వార్తలకు తిరిగి వెళ్లండి

రాష్ట్రపతి ద్రౌపది ముర్ము రాష్టప్రతి భవన్‌లో 66 మంది ప్రముఖులకు 2026 పద్మ అవార్డులను ప్రదానం చేశారు. ఇందులో దివంగత నటుడు ధర్మేంద్ర (మరణానంతరం), వయోలిన్ విద్వాంసురాలు డాక్టర్ ఎన్. రాజమ్‌లకు అత్యున్నత 'పద్మవిభూషణ్' అందించారు. అలాగే మాజీ సీఎం భగత్ సింగ్ కోష్యారీ, పారిశ్రామికవేత్త ఉదయ్ కోటక్ సహా ఆరుగురు 'పద్మభూషణ్' అందుకున్నారు.
క్రికెటర్ హర్మన్‌ప్రీత్ కౌర్ సహా 58 మందికి 'పద్మశ్రీ' పురస్కారాలు లభించాయి. ఈ ఏడాదికి మొత్తం 131 అవార్డులను రాష్ట్రపతి ఆమోదించగా, మిగిలిన వారికి తదుపరి విడతలో ప్రదానం చేయనున్నారు.
Comments
Loading comments...

