వార్తలకు తిరిగి వెళ్లండి

నెల్లూరు జిల్లా కావలిలో 'మత్స్యకారుల సేవ' కార్యక్రమాన్ని సీఎం చంద్రబాబు ప్రారంభించారు. మన తీరంలో పొరుగు రాష్ట్రాల బోట్లను రానిచ్చేది లేదని, మత్స్యకారుల హక్కులపై రాజీపడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. వేట నిషేధ కాల భరోసా కింద ₹262 కోట్లను నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లో జమ చేశారు.
వైకాపా హయాంలో మత్స్య ఉత్పత్తి పడిపోయిందని విమర్శించిన సీఎం, సముద్రపు నీటితో సీవీడ్ కల్చర్ పెంపకం ద్వారా మహిళలు ఆదాయాన్ని పెంచుకోవాలని ఈ సందర్భంగా సూచించారు.
Comments
Loading comments...

