వార్తలకు తిరిగి వెళ్లండి

పాలకుర్తి పుట్నూర్ కేజీబీవీ పాఠశాల పక్కన రైస్ మిల్లు ఏర్పాటుకు అనుమతి ఇవ్వొద్దని మాజీ సర్పంచ్ శారద కోరారు. కాలుష్యం వల్ల విద్యార్థినులు తీవ్ర ఆరోగ్య సమస్యల బారిన పడే ప్రమాదం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తూ, పంచాయతీ కార్యదర్శికి సోమవారం ఫిర్యాదు చేశారు.
విద్యార్థినుల భద్రతను దృష్టిలో ఉంచుకుని అధికారులు తక్షణమే స్పందించి అనుమతులు నిరాకరించాలని కోరారు.
Comments
Loading comments...

