Menu
వార్తలకు తిరిగి వెళ్లండి

నీటిపై రాజకీయాలు వద్దు: పొన్నం

Follow Udayam on Google
Vikram Chandra May 26, 2026 5:03 PM హైదరాబాద్General
నీటిపై రాజకీయాలు వద్దు: పొన్నం - Udayam
హైదరాబాద్ నగరంలో తాగునీటిని వృథా చేస్తే జరిమానాలు విధిస్తామని మంత్రి పొన్నం ప్రభాకర్ హెచ్చరించారు. భవిష్యత్ అవసరాల కోసం తమ ప్రభుత్వం గోదావరి, కృష్ణా కొత్త ఫేజ్ పనులను చేపడుతోందని, నీటి సరఫరాపై ప్రతిపక్షాలు ఉద్దేశపూర్వకంగా రాజకీయాలు చేయడం మానుకోవాలని ఆయన సూచించారు. ప్రస్తుతం నగరానికి 650 MGD నీరు సరఫరా అవుతుందని, ఎండకాలంలో 95 శాతం ట్యాంకర్లను 24 గంటల్లోనే అందిస్తున్నామని తెలిపారు. గత ప్రభుత్వం నగర నీటి అవసరాలపై ఎలాంటి ప్రణాళికలు చేయలేదని మంగళవారం జలమండలి సమీక్షలో మంత్రి విమర్శించారు.

Comments

G
Loading comments...